ఈ క్రెడిట్ అంతా సుకుమార్ దే

38
bunny

బన్నీ – సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. తొలి పార్టు డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టగా తిరుపతిలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ….దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఈ క్రెడిట్ అంతా సుకుమార్‌దేనని స్పష్టం చేశారు. చిత్తూరు యాసను నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డాను…సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మేముపడిన కష్టమంతా కూడా మరిచిపోతున్నామని తెలిపారు.

తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహించడం ఆనందంగా ఉందని.. మీ అందరి వెనుక ఆ ఏడుకొండలవాడు ఎలా ఉన్నాడో .. నా వెనుక సుకుమార్ అలా ఉన్నాడని తెలిపారు.