అఖిల్ భామపై కన్నేసిన పవన్‌..

107
pawankalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త జోరు పెంచాడు. గతంలో ఓ సినిమా రిలీజ్ అయ్యాకే మరో సినిమాపై దృష్టి సారించే పవన్‌..ఇప్పుడు ఏకంగా రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..తమిళ్ దర్శకుడు నేసన్‌ తో ఓ సినిమా..క్రేజీ కాంబినేషన్‌ గా ముద్ర వేసుకున్న త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలను లాంచనంగా ప్రారంభించిన పవన్,,,ఏ మాత్రం ఆలస్యం చేయకా..రెండు సినిమాను పూర్తీ చేయాలని చూస్తున్నాడు. అందుకే కాటమరాయుడు సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాతి సినిమాలకు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

pawankalyan

హీరోయిన్లను ఎంపిక చేసుకోవడంలో..కొత్త హీరోయిన్ల ను పరిచయం చేయడంలో పవన్ తర్వాతే ఎవరైనా అని చెప్పోచ్చు. పవన్ సినిమాల లీస్ట్ చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఒకే ఒక్క హీరోయిన్‌ తప్ప..పవన్‌ ఇప్పటి వరకు మరే ముద్దుగుమ్మ ను రెండోసారి రిపీట్ చేయలేడు. స్టార్ హీరోయిన్ల కన్నా..న్యూ కమర్స్ కే పవన్ ఎక్కువగా మొగ్గు చూపుతాడు. తాజాగా ఈసారి పవన్ అఖిల్ హీరోయిన్‌ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైయ్యాడు. కాటమరాయుడు తరువాత తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మించే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదలంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుందట.

అక్కినేని నట వారసుడు అఖిల్ సరసన హీరోయిన్గా పరిచయం అయిన సయేషా.., తరువాత బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన శివాయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. 19 ఏళ్ల ఈ బ్యూటి తాజాగా పవన్ సినిమాలో అవకాశం రావటంతో తెగ సంబరపడిపోతుందట.