రీ-రిలీజ్‌కు సిద్ధమైన కౌబాయ్ మూవీ…

30
- Advertisement -

ప్రస్తుత కాలంలో బహుబలితో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరిందని అందరూ అంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ 50యేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టేది కూడా సూపర్‌ స్టార్. 1970వ దశకంలో తొలి ఇండియన్ కౌబాయ్‌ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా తీశారు. దీన్ని టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు పరిచయం చేసి తెలుగు సినీ ఖ్యాతిని విస్తరింప జేశారు.

తమిళంలో మొసక్కరనుక్కు మొసక్కరన్, హిందీలో గన్‌ఫైటర్ జానీ పేరుతో విడుదల చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు ఈ సినిమాను హాలీవుడ్‌లో ది ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రిలీజ్ చేశారు. అయితే తాజాగా సుపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమాను ఆయన పుట్టిన రోజున విడుదల చేయడానికి సిద్ధం చేశారు. మే31న 4k ఫ్రింట్‌తో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు ఈ సినిమా రీ-రిలీజ్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశాడు.

Also Read: పిక్ టాక్ : ట్రెండీ వేర్ లో ఘాటు ఫోజులు

1971 ఆగస్టు 27లో తొలి ఇండియన్‌ కౌబాయ్‌ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత 50లక్షల గ్రాస్‌ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు.

Also Read: Srinagar:జీ20 మీటింగ్‌కు రామ్‌చరణ్‌

- Advertisement -