కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో జరిగిన సామూహిక కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుల వివరాలు, కాల్పులకు గల కారణం, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఇంకా పూర్తి సమాచారం నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వివరాలు ధృవీకరించిన తర్వాత అప్‌డేట్లు ఇస్తామని అధికారులు చెప్పారు.
మధ్యాహ్నం 1:20 గంటల నాటికి టంబ్లర్ రిడ్జ్ ఆర్‌సీఎంపీ అధికారులు టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకున్న యాక్టివ్ షూటర్ ఘటన స్థలంలో ఉన్నారు అని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం 3:15 గంటల తర్వాత విడుదల చేసిన మరో అప్‌డేట్‌లో ప్రాథమిక నిందితురాలు మృతి చెందిన స్థితిలో లభించినట్లు భావిస్తున్నాం. రెండో నిందితుడు ఉన్నాడా? మొత్తం బాధితుల సంఖ్య ఎంత? అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది అని పోలీసులు చెప్పారు.
టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలోని వారు ఇంట్లోనే ఉండండి, తలుపులు తాళం వేయండి, ఇంటి లేదా వ్యాపార స్థలం నుంచి బయటకు రావద్దు అని పోలీసులు తెలిపారు.
Also Read:పొట్లకాయ రసం..ప్రయోజనాలెన్నో!

