పొట్లకాయ రసం..ప్రయోజనాలెన్నో!

11
- Advertisement -

మన దైనందిన ఆహారంలో ఉపయోగించే కూరగాయలలో పొట్లకాయ ఒకటి. దీనితో చేసే వేపుడు, కర్రీ, పచ్చడి వంటి వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఈ కూరగాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్లకాయలో దాదాపు 98 శాతం నీరు ఉండటంతో పాటు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ Cతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

పొట్లకాయను వంటల రూపంలో తీసుకోవడం మంచిదే అయినా, రసం (జ్యూస్) రూపంలో సేవిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పొట్లకాయ రసం తాగితే జీవక్రియ మెరుగుపడి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అధిక బరువు ఉన్నవారు దీనిని అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుందట. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నా, పొట్లకాయ రసాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో అధికంగా సేవిస్తే జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి దీని చేదు రుచి కారణంగా అలెర్జీలు కూడా కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యానికి మేలు కావాలంటే పొట్లకాయను సమతుల్యంగా తీసుకోవడమే ఉత్తమం.

- Advertisement -