వరంగల్‌ మను ఫుడ్‌ రెస్టారెంట్‌ లో షార్ట్ సర్క్యూట్..!

117
manu restaurent
- Advertisement -

వరంగల్ చౌరస్తాలోని మను ఫుడ్‌ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే రెస్టారెంట్‌లో శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. క్రమంగా మంటలు రెస్టారెంట్‌ మొత్తానికి విస్తరించడంతో పెద్ద ఎత్తున మంటలు 3 అంతస్తుల పైకి ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రెస్టారెంట్‌తోపాటు మూడు షాపులు కాలిపోయినట్టు సమాచారం తెల్సింది.

ఎప్పుడు రద్దీగ ఉండే వరంగల్ చౌరస్తాలో అగ్నిప్రమాదం సంభవించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంగతి తెల్సిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటన ఉదయం పూట జరగడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు, కాని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -