కూకట్‌పల్లి థియేటర్‌లో అగ్నిప్రమాదం..

172
theatre
- Advertisement -

హైదరాబాద్ కూకట్‎పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. కేపీహెచ్‎బీ కాలనీలోని శివ పార్వతి థియేటర్‎లో  అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  విషయం తెలుసుకున్న అగ్నిపమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో థియేటర్‎లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -