టాటా-సన్‌షైన్ ‘ఆప్యాయ’ ఒప్పందం

87
ata

అమెరికాలో ఉంటున్న తెలంగాణవారి తల్లిదండ్రులకు స్వరాష్ట్రంలో వైద్య సహాయం, సహకారం అందించడం కోసం ఆప్యాయ అనే వినూత్నమైన ఒప్పందానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా), సన్ షైన్ హాస్పిటల్ యాజమాన్యం..

సికింద్రాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ లో ఇరువర్గాల ప్రతినిధులు ఒప్పందాల పత్రాలపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పటోళ్ల మాట్లాడుతూ ఇది ఆదాయం తెచ్చిపెట్టే ఒప్పందం కాదని ఒక సేవాకార్యక్రమం కోసం చేసుకుంటున్న ఒప్పందమని తెలిపారు. ఒక మంచి మనిషితోపాటు మంచి మనసు ఉంటేనే ఇది సాధ్యమని పేర్కొన్నారు.

సన్ షైన్ హాస్పిటల్ ఎండీ గురువా రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్న తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అమెరికాలో ఉంటున్న పిల్లలకు తెలియచేయడం కోసం ఆప్యాయ ఆల్వేస్ (Aapyaya always) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు..అమెరికాలో ఉంటున్న వారు తెలంగాణలో ఉంటున్న తమ తల్లిదండ్రుల కోసం కేవలం 100డాలర్లు చెల్లించి ఇందులో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.. తద్వారా వారికి 365రోజులు 24గంటలు వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటూ వైద్యసహయం అందచేయడంతో పాటు ఎప్పటుకప్పుడు వారి పరిస్థితిని గురించి తెలియచేయడం, వీడియో కాల్ ద్వారా మాట్లాడించడం జరుగుతుతుందని పేర్కొన్నారు.. సన్ షైన్, కిమ్స్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ తెలంగాణలో ఉంటున్న తల్లిదండ్రులకు అండగా ఉంటాయనె భరోసాను కల్పిస్తామని వెల్లడించారు.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగువారితో ప్రారంభిస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్ రాబోయే కాలంలో అన్ని దేశాల్లో ఉంటున్న తెలుగువారికి అందించేవిదంగా విస్తరిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు…