వాణి దేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి- మంత్రి హరీష్‌

161
Minister Harish Rao
- Advertisement -

కూకట్ పల్లి నియోజక వర్గం నైనా గార్డెన్ లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన కూకట్ పల్లిలో 5 లక్షల ఓట్లు ఉన్నాయి ,గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 24 వేల ఓట్లు ఉన్నాయి. కూకట్ పల్లి కార్యకర్తలకు శుభాకాంక్షలు, అభినందనలు.మేయర్ ఎన్నిక లో మీ పాత్ర కీలకం అన్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లకు వివరించాలి. హైదరాబాద్,కూకట్ పల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలి అంటే వాణి దేవిని బారి మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కోరారు.

కూకట్ పల్లి బ్రహ్మాండమైన అండర్ పాస్,ఫ్లై ఓవర్ లు వచ్చాయి. ఇక్కడ 200 కోట్లతో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావు,టీఆర్‌ఎస్ పార్టీ. కార్యకర్తలను స్వంత అన్నదమ్ములుగా చూసుకునే వ్యక్తి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే బాల నగర్‌లో ఎం ఉండే వారానికి మూడు రోజులు ధర్నాలు ఉండే.. కానీ ఇప్పుడు ఓటీ లు చేస్తున్నారు మన కార్మికులు. పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు ఎన్నో అవస్థలు పడేవారు. తెలంగాణ వచ్చాక ఇన్వర్టర్ లు ,జనరేటర్ లు పోయాయి 24 గంటల కరెంట్ వచ్చింది. మన మంచినీళ్ల పథకం కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. 24 గంటల రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొన్న ఈ మధ్యలో బీదర్ పోయాను , పోతూ పోతూ ఒక్క తండా లో ఆగినను.ఒక్క అక్కను అడిగాను ఎందుకు అక్క ఇక్కడ ఉన్నారు అంటే కరెంట్ వస్తే నీళ్లు పట్టుకుందామని ఉన్నామని అన్నారు.

బీజేపీ వాళ్ళకు చాలెంజ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం లో ఏ ఊరుకి అయిన పొదమాని అంటున్నాను మీరు సిద్ధమా..? కర్ణాటకలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కర్ణాటకకు చెందిన రైతు సంతోష్ వాళ్ళ గ్రామమును తెలంగాణలో కలుపుకోండి అన్నారు అంటే అర్థం చేసుకోండి. ప్రశ్నించే గొంతు అంటున్నారు ఎం ప్రశ్నిస్తున్నారు,ఐటీ ఐ ఆర్ రానందుకు కేంద్రాన్ని ప్రశ్నించండి.ఎందుకు ప్రశ్నిస్తారు డీజల్ ,పెట్రోల్ ,గ్యాస్ పెంచించేందుకు మీ కేంద్ర ప్రభుత్వంకు ప్రశ్నించాలి. గ్యాస్,పెట్రోల్,డీజిల్ పెంచినందకు మీకు ఓటు వేయలా.. పెట్రోల్ పోయించుకునే ముందు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మొన్న బిజెపి వాళ్ళు బడ్జెట్ పెట్టారు అందులో అంత మోసం. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ లో మెట్రో రైలు,బులెట్ ట్రైన్ లు ఇచ్చారు.. మరి ఇక్కడ కూకట్ పల్లి నుండి ఎందుకో పఠాన్ చెర్ కు పొదగించలేదని మంత్రి ప్రశ్నించారు.

ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఉడకొట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ప్రభుత్వ కంపనిలు ప్రైవేట్ పరం అవుతున్నాయి.. దీనితో దళిత బిడ్డలు రిజర్వేషన్లు కోల్పోతున్నారు.ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు అయితే ఇప్పటి 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తారు తిప్పి కొట్టాలి. మార్చి 8న మహిళ దినోత్సవం సందర్భంగా మహిళ శక్తిని ఏకాదటికి తెచ్చి మహిళ శక్తి చూపించాలి.వాణి దేవి మంచి విద్యావేత్త ఎంతో మందికి విద్యని అందించిన గొప్ప వ్యక్తి వాణి దేవి. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.సీఎం కేసీఆర్ వాణి దేవిని ప్రకటించిన వెంటనే బీజేపీకి భయం పట్టుకుంది. అబద్ధాలను అందంగా చెప్తారు వాళ్లకు గ్లోబల్ ప్రచార అవార్డు ఇవ్వలని ఎద్దేవ చేశారు. ఓటు వేయించే బాధ్యత మనది,ప్రశ్నించే గొంతు కావాలి అంటే పెరిగిన పెట్రోల్ డీజిల్ పై ప్రశ్నిస్తుంది. ఐటీ ఐ ఆర్ ఎందుకు రాష్ట్రంకు ఇవ్వలేదో ప్రశ్నిస్తుంది మా వాణి అక్క అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -