టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన..

48
ktr minister

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ సెక్రటరీలతో సోమవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…. ఇప్పటివరకు సుమారు 70 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని…సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం అనంతరం మార్చి 12న తర్వాత ప్రారంభమైన సభ్యత్వ నమోదు విజయవంతంగా కొనసాగుతుందన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం పూర్తయిందని, పలుచోట్ల లక్ష వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్. సభ్యత్వ నమోదును పది రోజులపాటు పొడిగించాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ని కోరగా విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటానని కేటీఆర్‌ చెప్పారు. లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు నమోదు చేయిస్తున్న పలువురు ఎమ్మెల్యేలను ఫోన్ చేసి అభినందించారు.