- Advertisement -
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి,బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతలుగా తెరకెక్కిస్తుండగా ఈ మూవీతో అనన్యపాండే టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ఖరారు చేయగా కరోనా లాక్ డౌన్‌తో షూటింగ్‌కి బ్రేక్ పడగా ఇప్పటివరకు చిత్రీకరణ ప్రారంభంకాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో మకాం వేసిన పూరి…సమస్యలను క్లియర్ చేసుకున్నారు. దీంతో షూటింగ్‌ని జనవరి నుండి ప్రారంభించాలని పూరి భావిస్తుండగా సంక్రాంతికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని టాక్.
- Advertisement -