మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.
హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ హై యాక్షన్ మూవీకి పాపులర్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారు.తాజాగా మరో స్టంట్ మాస్టర్ల జోడీ అన్బు-అరివు ఈ సినిమా టెక్నీషియన్ల బృందంలో జాయిన్ అయ్యారు. ‘కేజీఎఫ్’, ‘ఖైదీ’ లాంటి యాక్షన్ థ్రిల్లర్స్‌కు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అందించిన వారు, ‘ఖిలాడి’కి ఒళ్లు గగుర్పాటు కలిగించే కొన్ని యాక్షన్ సీన్లను డిజైన్ చేస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తుండటంతో యాక్షన్ లవర్స్‌కు ఈ మూవీ మంచి ట్రీట్ కానున్నది.హైదరాబాద్‌లో నిర్మించిన ఓ భారీ జైలు సెట్లో ప్రస్తుతం కొన్ని ప్రధానమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో రవితేజ పాల్గొంటున్నారు. కీలకమైన ఈ జైలు ఎపిసోడ్స్, ప్రత్యేకించి అన్బు-అరివు ఆధ్వర్యంలో తీస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్.. ‘ఖిలాడి’కి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కానున్నాయి.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ వంటి టాప్ టెక్నీషియన్లతో ఆయన పనిచేస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.’రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో, ఉన్నత ప్రమాణాలతో తీస్తున్నారు.