శుభవార్త…తగ్గిన బంగారం ధరలు

101
gold

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త…బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి రూ. 50, 830కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 క్షీణతతో రూ.46, 600కు చేరింది. బంగారం బాటలోనే వెండికూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై ఏకంగా రూ.1,500 తగ్గి రూ.70,500కు చేరింది.