రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరాహార దీక్షలు

122
mla dharma reddy

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలపై రైతులు కొనసాగిస్తున్న దీక్షలు తీవ్రతరం అయ్యాయి. ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు దీక్షను కొనసాగిస్తుండగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఈ నెల 29న నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్లు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

దేవాదుల ప్రాజెక్టు మూడో దశ ప‌నుల‌తో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో టీఎంసీ ప‌నుల‌ను ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేశారు. రైతుల కోసం జరిగే దీక్షలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.