మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు..!

82
- Advertisement -

ప్రతి ఇంట్లో ఉండే వంటింటి పదార్థాలలో మెంతులు కూడా ఒకటి. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాము. మెంతులు కూరల యొక్క రుచిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా చాలమందికి తెలియని ఎన్నో ఔషధ గుణాలు మెంతుల్లో ఉన్నాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోప్లావిన్, కాపర్ పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి వాటితో పాటు, విటమిన్ ఏ, బి6, సి, కె వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల మెంతులు మన శరీరానికి కావలసిన అన్నీ పోషకాలను అందిస్తాయి.

జీర్ణశయ సంబంధిత సమస్యలకు మెంతులు ఒక దివ్య ఔషధం.. స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచేందుకు మెంతులు దోహద పడతాయి.మెంతులు నానబెట్టి తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. కేవలం మెంతులే కాకుండా వాటి ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాల సమ్మేళనం అని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. పైత్యం అధికంగా ఉన్నవాళ్ళు మెంతు ఆకులను శుబ్రంగా కడిగి, రసంగా చేసుకొని ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం ఉందట.

ఇక మెంతు గింజలను పొడి చేసి వేయించి 1-2 చెంచాలు మజ్జిగతో కలిపి తీసుకుంటే నీళ్ళ విరోచనలు, రక్త విరోచనలు వంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. పేగుపూత వంటి సమస్యలకు కూడా మెంతులు మంచి ఔషధం. మెంతు గింజల పొడిని పాలతో కలిపి మొఖానికి రసుకుంటే మొఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ప్రతిరోజూ రాత్రి పూట 2-4 చెంచాల నానబెట్టి భోజనానికి ముందు తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది. ఇంకా చాలరోజులవరకు కూడా అదుపులో ఉంచుతుంది. మెంతు పొడిని కాస్త నిమ్మరసం జోడించి జుట్టుకు రాసి ఒక అరగంట తరువాత స్నానం చేయడం వల్ల.. జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా బలంగా తయారవుతుంది.

Also Read:Ind Vs Aus:వన్డే సిరీస్ భారత్‌దే

- Advertisement -