Gopichand 32లో బాలీవుడ్ బ్యూటీ!

10
- Advertisement -

‘మాచో స్టార్’ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.1 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్లతో గోపీచంద్‌ తొలిసినిమా ఇది. ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో గోపిచంద్‌ని ఈ సినిమాలో చూపించనుండగా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటించనుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఊర్వశీ. ఈ ఐటం సాంగ్ కోసం సినిమాకే హైలట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతుండగా ఓ భారీ కలర్ ఫుల్ సెట్ ను కూడా వేస్తున్నారట.

చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ని యూనిట్ పరిశీలసిస్తోండగా గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:దామిని ఎలిమినేట్

- Advertisement -