76 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను అందుకుంటోంది భారత్. ఈ ఏడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి,సంస్కరణలతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ముఖ్యంగా దేశంలో తయారీ రంగానిక విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా గతంలో విదేశాల నుండి అనేక వస్తువులను దిగుమతిచేసుకునే వాళ్లం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిపోవడంతో చైనా లాంటి దేశాన్ని సైతం వెనక్కి తోసేలా పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాం. ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సెక్టార్ ఆటోమేటివ్ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండటం, మేక్ ఇన్ ఇండియా నినాదం వల్ల ఐఫోన్లు సైతం ఉత్పత్తి చేసే స్ధాయికి ఎదిగాం.
గత ఏడు దశాబ్దాలుగా భారత ఆర్ధిక వ్యవస్థ అనేక ఆటుపోట్లను చూసింది. 1947లో దేశ జీడీపీ 2.7 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అది 3.17 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. దేశంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల వలన 2031 నాటికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా. ఇక దేశ ఆర్ధిక చరిత్రను ఓ సారి పరిశీలిస్తే 1966,1981,1991 సంక్షోభాలను ఎదుర్కొని ఇవాళ వేంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, ఆర్ధిక సంక్షోభం వెంటాడుతున్నప్పటికి వాటిని ధీటుగా ఎదుర్కొని నిలబడింది భారత్.
Also Read:హ్యాపీ బర్త్ డే టూ.. సూపర్ స్టార్ మహేష్
ప్రస్తుతం దేశంలో వేగంగా విస్తరిస్తున్న రంగాలను ఓ సారి పరిశీలిస్తే..
()గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ వాటర్, విండ్ , వెస్ట్, నుండి వస్తున్న విద్యుత్
()రీసైక్లింగ్ – ఎలాంటి వస్తువును అయినా రీసైకిల్ చేసి మరలా వాడే విధంగా చేసే పరిశ్రమలు
()ఈ కామర్స్ : ఈ రంగంలో గత పదేళ్ళలో పెను మార్పులు చూస్తున్నాం
()డాటా సైన్స్ : మార్కెట్ లో పెను సంచలనం తీసుకురాబోతున్న రంగం
()అగ్రి కల్చర్ : మనిషి మనుగడకి మూలం, ఇందులో కూడా విప్లవాత్మక మార్పులు చట్టాలు వస్తున్నాయి
మహానగరాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేక రంగాలలో అభివృద్ధి చెందుతోంది. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి,అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉపాధిని సృష్టించడం వేగవంతం కావడంతో మెరుగైన జీడీపీ సాధించగలుగుతున్నాం. భారతదేశ ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి వ్యవసాయ రంగం. వ్యవసాయం రంగంలో గణనీయమైన మార్పులు దేశ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నాయి.
Also Read:మోడీ.. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారా?
విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం, అంతర్జాతీయ కంపెనీలు దేశానికి ముఖ్యంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఇందుకు ప్రధానకారణం రవాణారంగంలో కనెక్టివిటీ బాగా అభివృద్ధి చెందింది. దేశంలో ఏ ప్రధాన నగరానికైనా గంటల్లోనే ప్రయాణించే వెసులుబాటు రావడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతేగాదు ఇండస్ట్రీ పాలసీ కూడా పెట్టుబడులు ఆకర్షించేందుకు తోడ్పడుతుండటం, స్టార్టప్ కంపెనీల రాకతో ఉద్యోగాల సృష్టి జరిగి దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి దోహదపడింది.