ఢిల్లీలో రైతు సంఘాలతో కేంద్రం చర్చ..

288
farmers
- Advertisement -

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఇప్పటికే కేంద్రంతో 5 సార్లు చర్చలు జరిపాయి రైతు సంఘాలు. తాజా చర్చలకు సంబంధించి కేంద్రానికి ఎజెండా పంపించాయి రైతు సంఘాలు.

మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతుల పై చర్చ జరపాలని కోరాయి.అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించడం.

రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలని ప్రతిపాదనలను ఉంచాయి. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలని…రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడం పై చర్చ జరగనుంది.

- Advertisement -