కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించాయి రైతు సంఘాలు. న సంయుక్త కిసాన్ మోర్చా సర్వసభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నాయి రైతు సంఘాల నేతలు.
ఏప్రిల్ 5 న ఎఫ్‌సిఐ బచావ్ దివాస్ నిర్వహించాలని నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా ఎఫ్‌సిఐ కార్యాలయాల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఏప్రిల్ 10 న కేఎంపి ఎక్స్‌ప్రెస్‌వే 24 గంటల నిర్బంధించాలని, ఏప్రిల్ 13 న ఢిల్లీ సరిహద్దుల్లో బైసాకి పండుగ నిర్వహించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ 14 న డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జన్మదినం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆందోళన, మే 1 కార్మిక దినోత్సవాన్ని ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహించాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. మే నెలలో పార్లమెంట్ మార్చ్ కు పిలుపునివ్వగా కార్యాచరణ అంత శాంతియుతంగా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుంది.