రహదారులను దిగ్బందించిన రైతులు!

159
jaipur
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరగా ఇవాళ జాతీయ రహదారుల దిగ్బందం,టోల్‌గేట్‌ల వద్ద ఫీజ్ చెల్లించవద్దని పిలుపునిచ్చారు అన్నదాతలు. దీంతో సింఘు, టిక్రి, ఘాజిపూర్ స‌హా ప‌లు ర‌హ‌దారుల‌ను మూసివేశారు. దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వ‌ద్ద రుసుములు క‌ట్ట‌కుండా నిర‌స‌న తెల‌పాల‌ని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో టోల్ గేట్ల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు.

ఢిల్లీ – జైపూర్ హైవే దిగ్బంధానికి భారీగా రైతులు చేరుకుంటున్నారు. రైతుల ఆందోళ‌న దృష్ట్యా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. మరోవైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీంతో పాటు ఇప్పటికే డీఎంకే ఎంపీ తిరుచి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా, ఛత్తీస్‌గఢ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌కు చెందిన రాకేశ్‌ వైష్ణవ్‌ కూడా గతంలోనే సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వివరణ ఇవ్వాలని జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్‌ 12న కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఆ పిటిషన్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా బీకేయూ పిటిషన్ దాఖలు చేయడంతో వీటిని అత్యున్నత న్యాయస్ధానం విచారించే అవకాశం ఉంది.

- Advertisement -