టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొని వియజవంతం చెయ్యాలని ఎన్నారైల పక్షాన ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసునని, కాబట్టి వారి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్న ధర్నా కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని మరొక్కసారి తెలంగాణ సత్తా ఢిల్లీకి తెలియజేయాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఉన్న ఎన్నారైలంతా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని, నాటి నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఎన్నారైలంతా ఉన్నారని, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉండి బంగారు తెలంగాణ నిర్మాణంలో బాగస్వాములవుతారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు.