ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ..

289
Allu Arjun
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలుపకుండా..కూతురి ఫోటోతో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలపడం ఏం బాగోలేదని బన్నీ తీరుపై కొంతమంది ఫ్యాన్స్‌ విమర్శలు చేశారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్‌ తన కూతురు మూడు నెలల చిన్నారి అల్లు అర్హ తో స్పెషల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ట్వీట్ చేశాడు.. అల్లు అర్హ తెల్లని దుస్తులు ధరించి భారత దేశ జెండా పక్కన బజ్జుకో పెట్టి.. ఓ ఫోటోని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.. ఆ ఫోటోలో అర్హ మూడు రంగులతో అతి పల్చని వస్త్రాలు.. మధ్యలో నీలం రంగులో చిన్నారి క్యాప్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ అర్హ క్యూట్ క్యూట్ గా ఉన్నది.

Allu Arjun

అల్లు అర్జున్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకు చాలా మంది నెటిజన్లు బన్నీ ఐడియా అదిరింది అని కామెంట్స్ చేయగా…కొందరు మాత్రం షాక్ ఇచ్చారు.. ఏపీ ప్రజలు రిపబ్లిక్ డేని ఆనందంగా జరుపుకొంటున్నారు అని మీరు అనుకుంటున్నారా…? ప్రత్యేక హోదా కోసం ఒక్క ట్వీట్ కూడా చేయాలని మీకు అని పించలేదా అని కామెంట్స్ చేశారు.. బన్నీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం..రిపబ్లిక్ డే రోజున ఆర్కే బీచ్‌లో విద్యార్ధులు మౌన దీక్ష చేయనున్న విషయం తెలిసిందే. అయితే వీరికి బన్నీ మద్దతు తెలుపుతూ పోస్ట్ చేయకపోవడంతో కొంతమంది బన్నీ తీరును తప్పుపట్టారు.

ఏదేమైనా దేశ భక్తికి సంబంధించిన అంశాలపై బన్నీ మాత్రం మిగతా హీరోలకు భిన్నంగా స్పందిస్తాడు. గతంలో ఇండిపెండెన్స్ డే కి “అయాం దట్ ఛేంజ్” అంటూ సుకుమార్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు.. తాజాగా తన గారాల పట్టి అర్షతో రిపబ్లిక్ డే విషెస్‌ తెలిపాడు.

- Advertisement -