రివ్యూ : లక్కున్నోడు

263
Luckunnodu Movie Review
- Advertisement -

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘లక్కున్నోడు’. గతంలో విష్ణు-హన్సిక కాంబినేషన్‌లో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి అందుకున్నారు. గీతాంజలి ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్కున్నోడు రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు మరో హిట్ కొట్టాడా లేదా చూద్దాం .

కథ:

లక్కీ(విష్ణు)ని దురదృష్టం వెంటాడుతుంది. అతడెంత దురదృష్టవంతుడంటే.. లక్కీ నాన్న(జయప్రకాశ్‌) కూడా అతనితో మాట్లాడడు. పద్మావతి(హన్సిక) ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంది. పద్మావతిని చూసిన లక్కీ తొలి చూపులోనే ప్రేమలో పడతారు. లక్కీ చెల్లెలికి నిశ్చితార్థం అవుతుంది. కట్నం డబ్బు రూ.25లక్షలు ఇవ్వడానికి వెళ్తే బ్యాగ్‌ ఎక్కడో పోతుంది. దీంతో తండ్రి కోప్పడటంతో లక్కీ ఆత్మహత్యకు యత్నిస్తాడు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి బ్యాగ్‌ ఇస్తాడు. దాన్ని ఒక్కరోజు దగ్గరుంచుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? ఇచ్చిందెవరు? ఆ తర్వాత ఏమైంది? దురదృష్టవంతుడు లక్కున్నోడు ఎలా అయ్యాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

Luckunnodu Movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమా మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టాఫ్‌, కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్. మంచు విష్ణు ఎప్పటిలానే తన స్టయిల్‌లో పర్ఫామెన్స్ చేశాడు. విష్ణు కామెడీ టైమింగ్‌ బాగుంది. బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పు కనిపిస్తుంది. మోహన్‌బాబును ఇమిటేట్‌ చేయడం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. తనికెళ్ల భరణి తనదైన హాస్యాన్ని పండించగా వెన్నెల కిషోర్‌,ప్రభాస్ శ్రీను,సత్యం రాజేష్‌ల కామెడీ బాగుంది. సాంకేతికంగా బాగుంది. రత్నబాబు సంభాషణలు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథ కొత్తదని చెప్పలేం కానీ ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాలనుకున్నారు. అది కాస్త చూసే ప్రేక్షకుడికి కొటీన్ అనిపించక మానదు. హన్సికకు పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలు, లవ్ సీన్స్‌లో తప్ప ఆమె పాత్రను కొత్తగా డిజైన్ చేయలేదు. లాజిక్ లేని సన్నివేశాలు నిరుత్సాహపరుస్తాయి.ఒకే పాయింట్‌ చుట్టూ కథ తిరగడంతో ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంది.

సాంకేతిక విభాగం:

టెక్నికల్‌గా సినిమా పెద్దగా ఆకట్టుకోదు. అనుకున్న కథ, నడిపించిన కథనం ఏది ఆకట్టుకోదు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుపెట్టుకునే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ కూడా అంతంతమాత్రంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఒకే అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Luckunnodu Movie Review

తీర్పు:

పరాయి సొమ్ముకి ఆశ పడని హీరో దగ్గరకు అనుకోకుండా పాతిక కోట్లు వస్తే ఏం చేశాడన్న కథతో సినిమా తెరకెక్కింది. మంచు విష్ణు నటన, కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా లాజిక్ లేని సన్నివేశాలు, ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. మొత్తంగా మరింత కసరత్తు చేస్తే విష్ణు మరింత లక్కున్నోడయ్యేవాడు.

విడుదల తేదీ : 26/01/2017

రేటింగ్ : 2.5/5

నటీనటులు: మంచు విష్ణు, హన్సిక

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ

దర్శకత్వం: రాజ్‌ కిరణ్‌

 

- Advertisement -