ఫ్యాన్ చేసిన పనికి చిరు షాక్..

5
- Advertisement -

యుకే పార్లమెంట్ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించేందుకు మెగాస్టార్ చిరంజీవి లండన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి చెంపుపై ముద్దు పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ చిరుపై తన అభిమానాన్ని పంచుకుంది ఆ మహిళా అభిమాని.

ఈరోజు లండన్ లో చిరంజీవి ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌ఫోర్టుకి తనతో పాటు తన తల్లిని తీసుకెళ్ళి అక్కడ చిరంజీవి ని చూశాక తన ఆనందానికి అవధుల్లేవని తెలిపింది. అలాగే చిన్నప్పుడు అమ్మ ని చిరంజీవి దగ్గర కి తీసుకెళ్ళు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే నేను చిరంజీవి దగ్గర కి తీసుకెళ్ళా. అమ్మ ఆనందానికి అవధులు లేవు అని చెప్పుకొచ్చింది.

 

Also Read:లండన్‌లో చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్

- Advertisement -