- Advertisement -
నటుడు సోనూసూద్ తన సేవల ద్వారా ఎంతో మంది ప్రేమాభిమానాలు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మల్కాజ్ గిరికి చెందిన ఓ వ్యక్తి… సోనూ మీద ప్రేమను ఓ టాటూ రూపంలో చూపించాడు. ఏకంగా సోనూ బొమ్మనే తన గుండెలపై పచ్చబొట్టులా పొడిపించుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.
లక్ష్మణ్ అనే సోషల్ వర్కర్ ఈ టాటూ వేయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి సోనూ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. ఆయన ఇలాంటి మంచి పనులెన్నో చేయాలంటూ.. టాలీవుడ్‌లో కూడా తన సహాయ సహకారాలు అందించాలంటూ కోరాడు. ఇక, ఈ వీడియో చూసిన సోనూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు.
- Advertisement -