పఠాన్‌పై విషప్రచారం!

22
srk
- Advertisement -

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షా అయ్యాడు. దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. బాద్ షా సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా బాలీవుడ్ ను బాయ్ కాట్ ట్రెండ్ కుదిపేస్తోంది. పలానా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ట్రెండ్ కు భారీ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి. తాజాగా షారుఖ్‌కి అలాంటి పరిస్థితే ఎదురైంది. బేషరమ్ పాట విడుదలైన దగ్గరి నుండి బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్ కాగా తాజాగా వాట్సాప్ యూనివర్సిటీలో షారుఖ్‌ పేరుతో వార్త వైరల్‌గా మారింది.

పఠాన్ సినిమా 25న వస్తోంది..పఠాన్‌ను ఫ్లాప్ చేసే ధైర్యం ఎవరికీ లేదు.. ఒకవేళ పఠాన్ ఫ్లాప్ అయితే తాను భారతదేశం వదిలి వెళ్లిపోతాను అని షారుఖ్ పేరుతో వార్త వైరల్‌ అయింది. ఇల్లు అమ్ముకోని విదేశాలకు పోతాను అంటున్న అతనికి సహాయం చేద్దా ఫ్రెండ్స్‌ అంటూ హల్ చల్‌ చేస్తోంది. అయితే వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలేవి షారుఖ్ చేయలేదు. కానీ కొంతమంది కావాలనే పనిగట్టుకుని షారుఖ్‌పై విషప్రచారం చేస్తున్నారు.

గతంలో ఆమిర్ ఖాన్ తో కలిసి తాను నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా సైతం బాయ్ కాట్ దెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -