మహా రాజకీయాల్లో అనూహ్య పరిణామం!

1
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు వేదిక వెనుక ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకోవడం మరింత ఆసక్తిని పెంచింది. మరోవైపు ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్…ఠాక్రే సోదరుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ముంబైలోని దాదర్‌లో ఉన్న సావర్కర్ స్మారక్‌లో మరాఠీ కార్టూనిస్టుల చరిత్ర, వారి రచనలతో రూపొందించిన ‘మహారాష్ట్రాచ్యా హాస్యరేఖా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే హాజరయ్యారు. ముగ్గురూ ఒకే వేదికను పంచుకోవడంతో పాటు గ్రీన్ రూమ్‌లో ప్రత్యేకంగా చర్చించుకోవడం రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది.

ఈ సందర్భంగా ఫడ్నవీస్ తనకు, ఉద్ధవ్ ఠాక్రేకు మధ్య గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2019కు ముందు ఉద్ధవ్ ఎప్పుడు ఫోన్ చేసినా తాను వెళ్లేవాడినని ఆ తర్వాత ఆయన నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

- Advertisement -