క్వైట్ మోడ్.. ఫేస్ బుక్‌లో కొత్త ఫీచర్..

459
fb
- Advertisement -

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ఫేస్‌ బుక్‌ తాజాగా మరో అప్‌డేట్‌తో వస్తోంది. దీనిపేరు క్వైట్ మోడ్. ఫేస్ బుక్‌లో యూజర్లు గడిపే కాలాన్ని ఈ ఫీచర్ తో నియంత్రించవచ్చు. దీన్ని ఫేస్ బుక్ యాప్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఓ గంట పాటు ఫేస్ బుక్ చూడకూడదని మీరు టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్ ను ఆన్ చేస్తే, ఆ గంట పాటు మీరు ఫేస్ బుక్ ను చూడడం వీలు కాదు సరికదా,ఫేస్ బుక్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రావు.

Quiet-Mode

అంతేకాదు, క్వైట్ మోడ్‌లో ఉన్నప్పుడు మీరు ఫేస్ బుక్ లోకి వెళ్లాలనుకుంటే వెంటనే మీకు హెచ్చరిక వస్తుంది. మీరు సెట్ చేసిన టైమ్ పూర్తయ్యే వరకు ఫేస్ బుక్ చూడడం కుదరదు అంటూ సందేశం వస్తుంది. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ ఆరోగ్య విభాగం హెడ్ కాంగ్ జింగ్ జిన్ తెలిపారు. ప్రస్తుతానికి క్వైట్ మోడ్ ఫీచర్ ను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ మే నెలలో అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -