మైహెమ్స్ గ్రూప్,గంగవరం పోర్టు లిమిటెడ్ భారీ విరాళం..

249
cmrf

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు లిమిటెడ్ వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు.

దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఛైర్మన్ డి.వి.ఎస్ రాజు ప్రగతిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సంస్థ ఛైర్మన్ కుమారుడు రాజేశ్ రాజ్, డి.టి నాయక్ పాల్గొన్నారు.

మైహెమ్స్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి 3 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును మైహోమ్స్ గ్రూప్స్ డైరెక్టర్లు జూపల్లి రామారావు, జూపల్లి శ్యామ్ రావు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు అందించారు.