టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019లో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లను హీరోలుగా తమన్నా మెహరీన్ లను హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతిబరిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని పైసావసూల్ చేసింది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ ఎఫ్3. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ మూవీ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అయితే కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగు ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సారి అంతా కూడా డబ్బువలన వచ్చే ఫ్రస్ట్రేషన్ చుట్టూ కథ తిరగనుంది. నిజానికి ఈ సినిమాను ఈ ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా షూటింగు జరగకపోవడం వలన, ‘సంక్రాంతి’కి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.