కరోనా బాధితుల కోసం సోనూసూద్‌ మరో ముందడుగు..

86
Sonu Sood

కరోనా ఉదృతి ఎంత వేగంగా పెరుగుతుందో.. అంతకుమించి వేగంగా సేవలు అందిస్తున్నారు రియల్‌ హీరో సోనూసూద్‌. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో సోనూసూద్ శ‌క్తి మేర సేవా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఢిల్లీలో క‌రోనా ఎక్కువ‌గా ఉండ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త పెరుగుతుండ‌డంతో సోనూసూద్ తుష్టి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ‌రికైన ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్ కావాలి అంటే 02261403615 ఈ నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే చాలని సోనూసూద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా మంది మా సాయం కోరారు. అందుకే రెండు ఫౌండేష‌న్‌తో క‌లిసి ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటి ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఉచితంగా మేము మీకు ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్ అందిస్తాం. మీ ప‌ని అయిన త‌ర్వాత ఖాళీ కాన్‌సెంట్రేట‌ర్ తిరిగి పంపండి. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడడం చాలా పెద్ద విషయమని పెద్దలు చెబుతారు. అదే నేను చేస్తున్నా అని సోనూసూద్ పేర్కొన్నారు.