బంగ్లాతో సంబంధాలు మరింత బలోపేతం:మోదీ

39
modi

బంగ్లాదేశ్‌తో సంబంధాల‌ను బ‌ల‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప్రాధాన్య‌తగా నిలిచిన‌ట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మోదీ…మిత్ర‌దేశాల విధానంలో బెంగ్లాదేశ్ కీల‌కంగా నిలుస్తుంద‌ని స్పష్టం చేశారు.

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల అంద‌రికీ అన్ని స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని, ఇలాంటి స‌మ‌యంలో బంగ్లాతో మంచి స‌హ‌కారం అందింద‌ని తెలిపారు. హెల్త్ ప్రొఫెష‌న‌ల్స్‌, కోవిడ్ టీకా అంశంలో రెండు దేశాలు క‌లిసి ప‌నిచేసిన‌ట్లు మోదీ తెలిపారు.

అనంతరం మాట్లాడిన బంగ్లా ప్రధాని హసీనా..కరోనాను భార‌త్‌ ఎదుర్కొన్న తీరు ప‌ట్ల ప్రశంసలు గుప్పించారు. బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం మ‌న‌సుపూర్తిగా స‌హ‌క‌రించిన భార‌త ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు హ‌సీనా తెలిపారు.