100 కోట్ల క్లబ్‌లో ఎఫ్‌2…!

430
f2 movie
- Advertisement -

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన మూవీ ఎఫ్‌2. పండగ రేసులో వినయ విధేయ రామ,కథానాయకుడు సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్టైంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 50 కోట్ల పైగా షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల షేర్ రాబట్టి 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.

2019లో వందకోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా నిలిచింది. సంక్రాంతి రేసులో హిట్ కొట్టే నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ ఏడాది కూడా మంచి ఆరంభంతో ప్రారంభించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ సీక్వెల్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోపాటు రవితేజ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం.

- Advertisement -