నిఖిల్‌-జగపతిబాబు మధ్య చిచ్చుపెట్టిన ‘ముద్ర’ !

294
nikhil jagapathi babu
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా టైటిల్‌తో మరో హీరో రావడం చూశాం. అంతేగాదు కొన్ని సినిమాల్లోని హైలైట్‌గా నిలిచిన పాటలతో టైటిల్స్‌ వచ్చాయి. కానీ తాజాగా ఒకే సినిమా టైటిల్‌తో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం ఫస్ట్ టైమ్‌.దీంతో ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.

లాంగ్ గ్యాప్ తీసుకుని యంగ్ హీరో ముద్ర అనే సినిమాతో వస్తున్నాడు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించగా టీఎస్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించనుండగా ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైన‌మిక్స్‌, ఎల్ఎల్‌పి ప‌తాకాల‌పై కావ్య వేణుగోపాల్‌, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

మ‌రో వైపు జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పేరుకూడా ‘ముద్ర’. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రావు రమేష్ నటించారు. ఈ సినిమా ఇవాళ విడుదల కానుండగా నిఖిల్ ముద్ర సినిమా అనుకొని అభిమానులు జ‌గ‌పతి బాబు సినిమా టిక్కెట్ల‌ని కొనుక్కుంటున్నారు. ఈ క్ర‌మంలో కాస్త అయోమ‌యం నెల‌కొంది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించారు నిఖిల్.నా సినిమా ఈ వారం రిలీజ్ కావ‌డం లేదు. కొంత మంది వ్య‌క్తులు కావాల‌నే నా సినిమా టైటిల్‌ని సేమ్ డిజైన్‌, లోగోని వాడుకున్నారు. నా చిత్రానికి సంబంధించిన వివరాల‌ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను అని నిఖిల్ పేర్కొన్నారు.

- Advertisement -