ఆగస్ట్ లో “ఎఫ్3” రెగ్యులర్ షూటింగ్

189
Anil Ravipudi

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ లు హీరోలుగా న‌టించిన ఈ చిత్రంలో మెహ‌రీ్న్, త‌మ‌న్నాలు హీరోయిన్లుగా న‌టించారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈచిత్రం 2019 సంక్రాతికి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ మంచి విజ‌యం సాధించ‌డంతోఎఫ్2 సీక్వేల్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్ ను రెడీ చేస్తున్నారు. అయితే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు చిత్ర‌యూనిట్ .స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్ సినిమాను త‌న ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి.