వెంకటేష్‌తో పనిచేయడం గర్వంగా ఉందని తెలిపారు హీరో వరుణ్ తేజ్. విశాఖ ఆర్కే బీచ్‌లో ఎఫ్2 ఆడియో రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్…నేను చేసే మిగతా సినిమాలు చూసి ఈ పాత్ర నాకు ఎవ్వరూ ఇవ్వరేమో. కానీ అనిల్ రావిపూడి ధైర్యం చేసి నాకు ఇచ్చారని తెలిపారు.జనవరి 12న సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం అని తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలై విజయవంతమయ్యాయి. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలన్నీ విజయవంతం కావాలని కోరుకొంటున్నానిన తెలిపారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖపట్నంలోనే ఈ సినిమా కథ రాశాను. ఈ సినిమాతో నాకు లభించిన మరో గొప్ప అవకాశం వెంకటేష్‌తో పనిచేయడం. ఈ సంక్రాంతికి కుటుంబంతో కలిసి ఈ సినిమాకొస్తే అందరూ సంతోషంగా నవ్వుకుని ఇంటికి వెళతారని తెలిపారు.
విశాఖపట్నంకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన వేడుక ఇదన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఒక్కసారి విశాఖపట్నం చూశాక ఏ ప్రముఖుడైనా సరే ట్వీట్ చేయకుండా వెళ్లడం లేదన్నారు. విశాఖలో ఆడియో,ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తే ఆ సినిమాలు తప్పకుండా విజయవంతమవుతాయని చెప్పారు.