విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ `ఎఫ్ 2`. `ఫన్ అండ్ ఫ్రస్టేషన్` ట్యాగ్ లైన్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ఫన్ రైటర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం కంప్లీట్ చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా U/A
సర్టిఫికేట్ పొందింది.
`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. మంచి చి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.