ఎన్టీఆర్..సందడి మొదలైంది

251
ntr kathanayakudu
- Advertisement -

నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ విడుదల కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది. సంక్రాంతి రేసులో ముందువస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో ఎన్టీఆర్ బయోపిక్ సందడి నెలకొంది. థియేటర్లను సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు బాలయ్య ఫ్యాన్స్‌.

పలు ప్రధాన కూడళ్లలో,బస్టాండ్‌లలో ఎక్కడచూసిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సుమంత్, విద్యాబాలన్, రకుల్ ప్రీత్, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు.ఇక ట్రైలర్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరో వ్యక్తి సమాధానం చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

- Advertisement -