18 వరకు టోల్‌ ఫ్రీ…

201
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం..నల్లకుబేరుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న విషయం పక్కనపెడితే టోల్ గేట్ వాహనాలకు మాత్రం కొంత ఉపశమనం కలిగించింది. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ల వద్ద సుంకం వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం గడువును మరో నాలుగు పెంచింది. గా నిర్ణయం తీసుకుంది. ఈనెల 18 వరకు టోల్‌గేట్ల వద్ద సుంకం వసూలు చేయరాదని తాజా ఆదేశాలిచ్చింది.

highways ministry

500,1000 నోట్లు రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర సమస్య ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే. సామాన్య ప్రజానీకంతో పాటు,,వాహాదారులకు కూడా చిల్లర ఇక్కట్లు తప్పలేదు. ముఖ్యంగా టోల్‌ గేట్ల సుంకం వద్ద ఇది మరింత తీవ్రమైంది. చిల్లర లేకపోవడంతో..కీలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు,,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. కొన్నిచోట్ల వాహనదారులు టోల్‌గేట్‌ సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. ఈ నేఫథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్‌ సుంకం రద్దు నిర్ణయాన్ని తీసుకుంది.

 మొదట 11వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ల వద్ద సుంకం వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. అయితే వారం రోజులైనప్పటికీ దేశంలో చిల్లర సమస్య తీరకపోవడంతో టోల్‌ సుంకం రద్దు గడువును మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో జాతీయ రహదారి వాహనదారులకు కాస్త వెసులుబాటు కల్పించినట్టైంది.

- Advertisement -