భారత్-చైనా‌ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత..

282
Indian and Chinese soldiers
- Advertisement -

చైనా శాంతియుతంగా చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటున్నామంటూనే మరో వైపు దాడులకు దిగుతోంది. తాజా చైనా మరోసారి హద్దుమీరింది.. చైనా బలగాల భారత్‌ సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. మరోసారి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద నిన్న రాత్రి నుంచి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఈ ఘర్షణలో ముగ్గురు భారీతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని భారత ఆర్మీ అధికారి ఒకరు ప్రకటన చేశారు.

ల‌డ‌ఖ్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో.. ఇరు వైపులా న‌ష్టం జ‌రిగిన‌ట్లు తాజాగా భార‌త్ పేర్కొన్న‌ది. తొలుత చేసిన ప్ర‌క‌ట‌న‌ను.. భార‌త ఆర్మీ మ‌ళ్లీ స‌వ‌రించింది. భార‌త్ బోర్డ‌ర్ దాటింద‌ని మ‌రో వైపు చైనా అధికారులు ఆరోపిస్తున్నారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. కాసేప‌టి క్రితం సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు త్రివిధ‌ద‌ళాల‌కు చెందిన చీఫ్‌లు, విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో స‌మావేశం అయ్యారు. ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వారు చ‌ర్చించారు. మిలిట‌రీ స్థాయిలో స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే.. దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -