మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత.కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన సుంకరి అనసూయ బ్రతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నని, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగం ,ఉపాధి కోల్పోయానని ,ఇండియాలో ఉన్న తన కుటుంబానికి ఆదుకోవాలని ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత కు తన ఆవేదనను వ్యక్తం చేశారు అనసూయ.
వెంటనే స్పందించిన కవిత…… సుంకరి అనసూయ కుటుంబ సభ్యులకు తనవంతు సహాయంగా 50 వేల రూపాయలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు అందజేసి, అనసూయ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరారు.
దీంతో ధర్మారావు పేట్ లోని సుంకరి అనసూయ ఇంటికి వెళ్లి కుటుంబానికి ఆ డబ్బును అందజేశారు ఎమ్మెల్యే జాజాల సురేందర్. సకాలంలో స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ కవిత కు సుంకరి అనసూయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సత్యం రావు, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.