గుజరాత్ ప్రమాదం..విమానంలో మాజీ సీఎం!

11
- Advertisement -

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది లండన్‌ వైపు ప్రయాణిస్తున్న విమానం కాగా, మధ్యాహ్నం 1:38కి టేకాఫ్ తీసుకుని, రెండు నిమిషాల్లోపే కుప్పకూలినట్లు తెలుస్తోంది.

Air India కు చెందిన Boeing 787 Dreamliner విమానం ఒక భవనంపై కుప్పకూలింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి దట్టమైన నల్లటి పొగ పరిసరాలను కప్పేసింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా వచ్చిన వార్తల ప్రకారం, మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపాణీ ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది, అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు.

అత్యవసర సేవలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అత్యంత తీవ్రతతో మంటలను అదుపుచేసేందుకు 7 ఫైరింజన్లు పనిచేస్తున్నాయి. ఈ ప్రమాదంలో అనేకమంది మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఇంకా అధికారికంగా మరణాల సంఖ్య ప్రకటించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

Also Read:గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం

- Advertisement -