దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రత్యామ్నాయం ఏర్పడాలన్న కేసీఆర్ నిర్ణయంపై పలు ప్రాంతాయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించగా… దేశ రాజకీయాల్లో మార్పు కోసం తాము సైతం కలిసి వస్తామని చెప్పారు.
తాజాగా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం,జనతా కాంగ్రెస్ నేత అజిత్ జోగి.. కేసీఆర్‌కు జై కొట్టారు. ఈ మేరకు కేసీఆర్ కు ఫోన్ చేసిన ఆయన మీరు ఏర్పాటు చేసే ఫ్రంట్ లో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారు. రాష్ర్టాన్ని సాధించి సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడిగా ఎదిగారని తెలిపారు. భవిష్యత్‌లో కేసీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని జోగి పేర్కొన్నారు.
పవర్ స్టార్,జనసేన అధినేత పవన్ కల్యాణ్, విప్లవ సినిమాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి సైతం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.