సూర్య..ఎన్‌జికె

309
- Advertisement -

గజ‌ని,సింగం చిత్రాల హీరో సూర్య,ఫిదా ఫేమ్ సాయిపల్లవి,రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని 7జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తుండగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌.ప్రభు, ప్రకాష్‌బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర విడుద‌ల చేసింది. ఈ సినిమాకి ‘ఎన్‌.జి.కె’ అనే టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేయగా ఫస్ట్‌ లుక్‌తో సూర్య అదరగొట్టాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా సూర్యకిది 36వ సినిమా.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌.

NGK First Look

- Advertisement -