పరకాల.. అభివృద్ధికి కృషి చేస్తా:కేటీఆర్

197
KTR speech at Parakala public meeting
- Advertisement -

పేద కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన పెద్దకొడుకు సీఎం కేసీఆర్‌ అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్..తెలంగాణ సంక్షేమంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పరకాల సస్యశ్యామలం అవుతుందన్నారు.

చల్లా ధర్మారెడ్డి లాంటి వ్యక్తి పరకాలకు ఎమ్మెల్యే ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. పరకాల అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరకాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు.

24 గంటల కరెంట్ వ్యవసాయానికి ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్ధితి దయనీయంగా తయారైందన్నారు. కానీ నేడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలో ఏ సీఎం ఆలోచన చేయని విధంగా ప్రతీ ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి,ఉచితంగా ఎరువులు సరఫరా చేయబోతున్నామని చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైందని..ఏనాడు రైతుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయలేదన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల భీమా అందించే పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. పరకాల నగర పంచాయతీ రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నామని…ఇక్కడే కాకతీయ టెక్స్‌ టైల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆశీర్వాదాలు అందజేయాలని చెప్పారు కేటీఆర్‌.

- Advertisement -