కేంద్ర‌మాజీ మంత్రి సీకే జాఫ‌ర్ క‌న్నుమూత‌..

237
jaffer sharif
- Advertisement -

కేంద్ర‌మాజీ మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత సీకే జాఫ‌ర్ ష‌రీఫ్ క‌న్ను మూశారు. గ‌త శుక్ర‌వారం ఆయ‌న న‌మాజ్ చేసేందుకు వెళుతూ కారు ఎక్కుతుండ‌గా ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. దీంతో వెంట‌నే అత‌న్ని బెంగళూర్‌ లోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. ఐసీయూలో ఉంచి, చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.

ck Jaffar

సీనియర్‌ నేత జాఫర్‌ షరీఫ్‌ మృతి పట్ల కర్నాటక పీసీసీ చీఫ్‌ దినేష్‌ గుండూరావు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, జాఫర్ షరీఫ్ మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పలుమార్లు ఎంపీగా, కేంద్ర రైల్వే మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులను ఆయన చేప‌ట్టారు.

- Advertisement -