‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’.. ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్‌

643
- Advertisement -

ఒక‌బ్బాయి, అమ్మాయి.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డ అమ్మాయి.. త‌న ప్రేమ‌ను మాత్రం అత‌నికి చెప్ప‌దు. అబ్బాయి ఫోన్ చేసినా తిడుతుంది.. చేయ‌క‌పోయినా తిడుతుంది. అయితే ప్రేమిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉండే అంత‌రం కులం.. మ‌రి ఈ అంతరాన్ని దాటి ఇద్ద‌రు ప్రేమికులు ఒక‌ట‌య్యారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు.

Evvarikee Cheppoddu Release Trailer

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో రూపొందిన ల‌వ్‌స్టోరీ `ఎవ్వ‌రికీ చెప్పొద్దు`. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ డిఫ‌రెంట్‌గా ఉందంటూ అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత రాకేశ్ వ‌ర్రె మాట్లాడుతూ – “హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దిల్‌రాజు మా సినిమాను అక్టోబ‌ర్ 8న‌ రిలీజ్ చేస్తున్నారు. ఆయ‌న అందిస్తున్న స‌హ‌కారానికి .. ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రూ బావుంద‌ని అంటున్నారు. సినిమా త‌ప్పకుండా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు. న‌టీన‌టులు: రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్ర‌గ‌డ‌.

https://youtu.be/U1v4PXCedYA

- Advertisement -