వన్డే సిరీస్ గెలిచిన జోరుతోనే టీ20 మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంటారని భావించినా భారత్‌కు గట్టి షాక్ తగిలింది. కరీబియన్ జట్టు భారత్‌తో జరిగిన ఏకైక టీ20లో మాత్రం అద్భుత విజయంతో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ చేతిలో ఎదురైన వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఎవిన్ లూయిస్ (62 బంతుల్లో 6 ఫోర్లు, 12 సిక్సర్లతో 125 నాటౌట్) భారత్‌పై టీ20ల్లో వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కాడు. మార్లోన్ శామ్యూల్స్ (36), క్రిస్ గేల్ (18) అతనికి సహకారం అందించారు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కోహ్లీ, ధవన్ శుభారంభాన్ని చ్చారు. తొలి ఓవర్ నుండే విరుచుకుపడ్డ ఒపెనర్లు.. ఐదు ఓవర్లలోనే స్కోరు 54/0తో నిలిచింది. విలియమ్స్ వేసిన ఆరో ఓవర్లో కోహ్లీ 6, 4తో అదరగొట్టాడు. కానీ.. ఆ తర్వాతి బంతికే మరో షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇదే ఓవర్లో ధవన్ కూడా రనౌటవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో యువ ఆటగాడు రిషభ్ పంత్, దినేష్ కార్తీక్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. హాఫ్ సెంచరీకి చేరువైన కార్తీక్ బౌల్డయ్యాడు. ఈ దశలో టేలర్ భారత్‌ను దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో ధోనీ (2), పంత్‌లను అవుట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. కేదార్ జాదవ్ (4) కూడా నిరాశపర్చాడు. ఆఖరి ఓవర్లో జడేజా (13 నాటౌట్), అశ్విన్ (11 నాటౌట్) 18 పరుగులు రాబట్టడంతో స్కోరు 190కి చేరింది.