జ్యోతి లక్ష్మిని తలపించే రియల్‌ లవ్‌ స్టోరీ..!

227
lorry driver fell in love with prostitute woman
lorry driver fell in love with prostitute woman
- Advertisement -

జ్యోతిలక్ష్మి (చార్మి) చాలామందికి తెలిసిన వేశ్య.. సత్య(సత్య) అనే కుర్రాడు ఆ బ్రోతల్‌ హౌస్‌కు వెతుకుంటూ వచ్చి ఆమెను ఇష్టపడి ఐలవ్యూ చెబుతాడు. ఆ మాట బూతులా ఉందంటూ నవ్వేసి చిలిపిగా అల్లరిగా సత్యని ఆటపట్టిస్తుంది జ్యోతిలక్ష్మి. నీ కోసం ఏడ్చి ఎదురుచూసే అమ్మాయిని పెళ్ళిచేసుకొమ్మని సలహా ఇస్తుంది. అయినా సత్య ఆమె శరీరాన్ని వాంచించి కాకుండా పెళ్ళిచేసుకుంటానంటాడు. జ్యోతిలక్ష్మిని ఆ బ్రోతల్‌ హౌస్‌ నుంచి సత్య బయటకి తీసుకెళ్ళాలని తనకోసం నిర్వాహకులతో దెబ్బలు తినడంతో అతని మాటకు ఒకే చెప్పిన జ్యోతిలక్ష్మి సత్యను పెళ్ళిచేసుకుంటుంది. 45 ఏళ్ళ క్రితం మల్లాది వెంకటక్రిష్ణమూర్తి రాసిన “మిసెస్‌ పరాంకుశం” నవల ఈ చిత్ర కథకు ఆధారం. అయితే ఇంతకు ఇదంతా ఎందుకంటే ఇలాంటీ స్టోరీ ఒకటి ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది..

ఢిల్లీలో కారు డ్రైవరుగా జీవనం సాగించే ఓ 28 ఏళ్ల యువకుడు నగరంలోని జీబీరోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికలోని ఓ వేశ్య వద్దకు వెళ్లాడు. అదే తొలిసారి అయిండొచ్చు.. లేదా ఆ రాత్రి మాంచి సుఖాన్ని ఇచ్చి ఉండొచ్చు.. ఆమెతో తొలి క‌ల‌యిక‌లోనే అత‌డు ఆమెపై మ‌న‌స్సు పారేసుకున్నాడు. అప్ప‌టి నుంచి ప‌దే ప‌దే అత‌డు ఆమె కోస‌మే ఆ వేశ్యా వాటిక‌కు వెళుతున్నాడు. కొద్ది రోజుల త‌ర్వాత ఆ డ్రైవర్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. ఆమె కూడా ఓకే అనడంతో.. ఎగిరి గంతేశాడు.. మరీ అక్కడి నుండి ఆమెను భయటకు తీసుకురావాడానికి.. ఢిల్లీ మహిళా కమిషన్ ను ఆశ్రయించి త‌న ప్రేమ విష‌యాన్ని చెప్పాడు.

పోలీసుల సహకారంతో ఆమెను వేశ్యావాటిక నుంచి విముక్తి కల్పించడం.. యువకుడి తల్లితండ్రులు ఆమెతో పెళ్లికి ఒప్పుకోవడం.. జరిగిపోయాయి.. అంతే ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఈ మహిళ నేపాల్ నుంచి పేదరికం తట్టుకోలేక ఇండియాకు వలస వచ్చి ఉపాధి కోసం చూస్తూ…జీబీరోడ్డులో వ్యభిచారిణిగా మారింది. నిజానికి సరైన మగాడి అండ లేకపోవడంతో ఎందరో ఇలాంటి జ్యోతిలక్ష్మీలు వేశ్య గృహాల్లో నరకం అనుభవిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.. “కుటుంబంలో మగవాళ్ళు ఫెయిల్‌ అయినచోట వేశ్యలు పుడతారు. సొసైటీ ఫెయిల్‌ అయితేనే వేశ్యలు పుడతారు” అనే డైలాగ్‌లో కొంత నిజం లేకపోలేదు..

- Advertisement -