తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు న ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటుదాం అని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు అన్న విషయం విదితమే. ఈనెల 17వ తేదితో 65వసంతాలు పూర్తిచేసుకుని 66వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇక ముఖ్యమంత్రి పుట్టినరోజున కేక్ లు, బ్యానర్లు ఇలాంటి హడావుడి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీఎం అభిమానులు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని కోరారు మంత్రి కేటీఆర్.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న కేసీఆర్ 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని మనకు అందించిన సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు సందర్భంగా హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున విరివిగా మొక్కలు నాటుదామని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్క నాటి 8790909999కు సెల్ఫీ పంపించాలని పిలుపునిచ్చారు.